టేలర్ స్విఫ్ట్ పెళ్లి వార్తలు.. నిజమా? ప్రచారమా?

టేలర్ స్విఫ్ట్ పెళ్లి వార్తలు.. నిజమా? ప్రచారమా?

ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్, అమెరికన్ ఫుట్‌బాల్ స్టార్ ట్రావిస్ కెల్సీ వివాహం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. న్యూయార్క్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, సంగీత, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారని పోస్టులు ప్రచారం చేస్తున్నాయి. అలాగే మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య వివాహం నిర్వహించారని కూడా పేర్కొంటున్నాయి.

వైరల్ కథనాల ప్రకారం, సెలెనా గోమెజ్, గిగీ హడిద్, బ్రాడ్లీ కూపర్, ఎడ్ షీరన్ తదితర ప్రముఖులు వేడుకలో పాల్గొన్నారని, వివాహానికి ముందు గ్రాండ్ రిహార్సల్ డిన్నర్ కూడా నిర్వహించారని చెబుతున్నారు. అంతేకాకుండా అతిథులకు వజ్రాలతో అలంకరించిన ఖరీదైన షాంపైన్ గ్లాసులను బహుమతిగా ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.

అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు టేలర్ స్విఫ్ట్ లేదా ట్రావిస్ కెల్సీ తరఫున ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. విశ్వసనీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ వివాహాన్ని ధృవీకరించలేదు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ సమాచారం నిర్ధారణ లేని ప్రచారంగానే పరిగణించాల్సి ఉంది.

Related Articles