అనిల్ రావిపూడి మూవీలో కళ్యాణ్ రామ్ కొత్త అవతారం

అనిల్ రావిపూడి మూవీలో కళ్యాణ్ రామ్ కొత్త అవతారం

నందమూరి కళ్యాణ్ రామ్‌కు బర్త్‌డే సందర్భంగా ఆయన నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం #VenkyAnil5 (#NKRAR2) నుంచి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేష్, కృతి శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో కళ్యాణ్ రామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక పోస్ట్ చేశారు. తన తొలి చిత్రం ‘పటాస్’తో దర్శకుడిగా అవకాశం ఇచ్చి తనపై నమ్మకం ఉంచిన తొలి హీరో కళ్యాణ్ రామ్ అని గుర్తుచేసుకున్నారు. ఈ సినిమాలో ఆయన్ని సరికొత్త లుక్‌లో చూపించబోతున్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉందని తెలిపారు. అలాగే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ‘పటాస్’ తర్వాత అనిల్ రావిపూడి –కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో పాటు వెంకటేష్ కూడా భాగస్వామి కావడం వల్ల ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles