‘నాగబంధం’లో నా పాత్ర చూసి షాక్ అవుతారు..!

‘నాగబంధం’లో నా పాత్ర చూసి షాక్ అవుతారు..!

ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ సినిమాపై హీరోయిన్ నభా నటేష్ భారీ అంచనాలు వ్యక్తం చేశారు. విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తాను పార్వతి అనే వేద విద్యార్థిని పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు చేయని బలమైన పాత్ర ఇదేనని, తన పాత్ర కథను కీలక మలుపు తిప్పుతుందని చెప్పారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో 5 వేల మంది డ్యాన్సర్లతో తెరకెక్కిన గ్రాండ్ సాంగ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందని వెల్లడించారు. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్‌లో చిత్రీకరణ సమయంలో ప్రతిరోజూ పూజలు చేసిన తర్వాతే షూటింగ్ ప్రారంభించేవాళ్లమని చెప్పారు. రూ.110 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంటుందని, విజువల్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత యాక్సిడెంట్ కారణంగా బ్రేక్ తీసుకున్నానని, పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ నటించడం ప్రారంభించానని తెలిపారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Articles