చెఫ్‌లపై కామెంట్‌కు చిన్మయి రిప్లై

చెఫ్‌లపై కామెంట్‌కు చిన్మయి రిప్లై

పుణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసు నేపథ్యంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చేసిన సోషల్ మీడియా పోస్టు చర్చనీయాంశంగా మారింది. సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల నేపథ్యంలోనే తాను ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాన్ని తెరకెక్కించానని ఆయన తెలిపారు. ఆసక్తికరమైన కథ దొరికితే భవిష్యత్తులో మహిళ చేసిన నేరంపై సినిమా తీయొచ్చేమో గానీ, మహిళల నేరాలను సాధారణీకరిస్తూ కథలు తీయనని స్పష్టం చేశారు. రాహుల్ వ్యాఖ్యలకు ఆయన భార్య, గాయని చిన్మయి మద్దతు తెలిపారు. రాహుల్ అందరిలా ఆలోచించరని, అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని ఆమె పేర్కొన్నారు.

ఈ పోస్టుకు స్పందించిన ఓ నెటిజన్, “అందరికీ వంట చేసే వాళ్లు దొరకరు” అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. దీనికి చిన్మయి ఘాటుగా స్పందిస్తూ, ఇంట్లో మహిళలు చేసే వంటను కొందరు తక్కువ చేసి మాట్లాడటం సరైన విధానం కాదన్నారు. పెద్ద పెద్ద హోటళ్లలో ప్రముఖ చెఫ్‌లు కూడా ఎక్కువగా పురుషులేనని గుర్తుచేశారు. వంటను కేవలం మహిళల బాధ్యతగా చూడకూడదని, ఆ పనిని స్త్రీలు పురుషులతో ముడిపెట్టడం సరికాదని ఆమె పేర్కొన్నారు.

Related Articles