34 మంది స్టార్లతో భారీ చిత్రీకరణ

34 మంది స్టార్లతో భారీ చిత్రీకరణ

బాలీవుడ్ మల్టీస్టారర్ చిత్రం ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను దర్శకుడు అహ్మద్ ఖాన్ వెల్లడించారు. 34 మంది ప్రముఖ నటీనటులతో తెరకెక్కిన ఈ యాక్షన్ -అడ్వెంచర్ కామెడీ చిత్రాన్ని పూర్తి చేయడం పెద్ద సవాల్‌గా మారిందన్నారు. దర్శకుడు తెలిపిన ప్రకారం, షూటింగ్ సమయంలో ప్రతిరోజూ 700 నుంచి 900 మంది వరకు సెట్‌లో పనిచేసేవారు. నటీనటుల వ్యక్తిగత సిబ్బంది, సాంకేతిక నిపుణులు, స్టంట్ టీమ్, డ్యాన్సర్లు తదితరులతో సెట్స్ సందడిగా ఉండేదని చెప్పారు. వీరందరి కోసం సుమారు 250 కార్లు, 50 వ్యానిటీ వ్యాన్లు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని, వాటి పార్కింగ్‌కే రెండు పెద్ద మైదానాలను అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు.

అత్యంత కష్టమైన పని నటీనటుల డేట్లను సమన్వయం చేయడం, అందరి షెడ్యూల్‌కు అనుగుణంగా షూటింగ్ నిర్వహించడమేనని అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. ఒక్కో స్టార్‌కు వేర్వేరు తేదీలు ఉండటంతో పాటు, వారి పీఆర్ బృందాల ఒత్తిడి కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Related Articles