విజయ్ దేవరకొండపై ఫేక్ ప్రచారం

విజయ్ దేవరకొండపై ఫేక్ ప్రచారం

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’కి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లను చిత్ర బృందం ఖండించింది. షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ 5 -6 కారవాన్లు, 40 -50 మంది అసిస్టెంట్లను డిమాండ్ చేశారంటూ, నిర్మాతలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ను ఆశ్రయించారనే వార్తలు ఇటీవల ప్రచారంలోకి వచ్చాయి. ఈ ప్రచారంపై స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేత వై. రవిశంకర్, అవన్నీ పూర్తిగా అవాస్తవాలని స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ ఎంతో ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తారని, షూటింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని తెలిపారు.

విజయ్ దేవరకొండ టీమ్ కూడా ఈ వార్తలను కావాలనే సృష్టించిన తప్పుడు ప్రచారంగా పేర్కొంటూ, దీనికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’లో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్నారు. 1854 –1878 మధ్య బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగే ఈ పీరియడ్‌లో జరిగిన యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ప్రధాన ప్రతినాయకుడిగా నటించడం చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Related Articles