బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘చౌహాన్’ టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వీడియోలో అజయ్ దేవ్‌గణ్ ఇంటెన్స్, రగ్డ్ లుక్‌లో కనిపించి సినిమాపై ఆసక్తిని పెంచారు.
బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం కాశ్మీర్‌లోని పుల్వామా నేపథ్యంలో రూపొందుతోంది. మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా సినిమా తెరకెక్కనుంది. యుద్ధ వాతావరణం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులకు విభిన్న అనుభూతిని అందించనుంది.
ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ ఈ ప్రాజెక్ట్‌కు మద్దతుగా నిలుస్తుండగా, నీరజ్ యాదవ్ దర్శకత్వం వహించడంతో పాటు కథను కూడా అందిస్తున్నారు. జియో స్టూడియోస్‌కు చెందిన జ్యోతి దేశ్‌పాండే, ఆనంద్ ఎల్ రాయ్ కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, హిమాన్షు శర్మ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా విడుదలైన అనౌన్స్మెంట్ వీడియోకు మంచి స్పందన లభిస్తోంది. అజయ్ దేవ్‌గణ్ యాక్షన్, ఆనంద్ ఎల్ రాయ్ భావోద్వేగ కథనం కలయికలో రూపొందుతున్న ‘చౌహాన్’ ఆయన కెరీర్లో మరో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

