కృష్ణమోహన్ (కేఎం), పూజా సుందర్ శెట్టి జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఇట్స్ లైఫ్ బ్రో’ ఫస్ట్ లుక్ విడుదలైంది. హీరో నితిన్ ఈ పోస్టర్‌ను ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
కేఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కృష్ణమోహన్ సల్లగుండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సోమశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా భావోద్వేగాలతో కూడిన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉంటుందని దర్శకుడు తెలిపారు.
ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, అంబటి శ్రీనివాస్, దేవి ప్రసాద్, కిరీటి, త్రిశూల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేను ఇ. రాజయ్య అందించగా, చైతన్య సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాహిత్య సాగర్ సంగీతం సమకూరుస్తుండగా, సత్య గిద్దుటూరి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. భావోద్వేగ ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

