చిన్మయి విమర్శలకు సునీత రియాక్షన్

చిన్మయి విమర్శలకు సునీత రియాక్షన్

గాయని సునీత ఇటీవల మహిళల దుస్తులు, ‘మై బాడీ మై రైట్’ అంశంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన గాయని చిన్మయి శ్రీపాద, మహిళల శరీరంపై నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా వారిదేనని పేర్కొంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఈ వివాదంపై తాజాగా స్పందించిన సునీత, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు. ‘మై బాడీ మై విష్’ అనే భావన తనకు పూర్తిగా తెలుసని, ప్రతి వ్యక్తికి తన శరీరంపై నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుందని చెప్పారు. అయితే తాను చెప్పదలచుకున్నది సమాజంలోని ప్రస్తుత వాస్తవ పరిస్థితుల గురించేనని, సమాజం ఇంకా పూర్తిగా మారలేదనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేసినట్లు వివరించారు.

మహిళలపై జరిగే వేధింపులు, అన్యాయాలను తాను ఎప్పటికీ సమర్థించనని, మహిళల పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వారికి వ్యతిరేకంగా నిలబడతానని సునీత స్పష్టం చేశారు. అలాగే చిన్మయిపై తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు.

ఫెమినిజం అంటే మహిళలు, పురుషులు పరస్పరం గౌరవించుకోవడం, అవకాశాల్లో సమానత్వం ఉండటమేనని సునీత పేర్కొన్నారు. మహిళలను తక్కువగా చూడడం, వారి అభిప్రాయాలను నిర్లక్ష్యం చేయడాన్ని వ్యతిరేకించడమే తన దృష్టిలో నిజమైన ఫెమినిజమని ఆమె అన్నారు.

Related Articles