రియల్ స్టార్ శ్రీహరి వారసుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్టూడెంట్’. విజేత పరీక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ బ్యానర్లపై బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. బాలు తత్వమసి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. పోస్టర్‌లో మేఘాంశ్ శ్రీహరి ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తూ ఆసక్తిని పెంచారు. స్టూడెంట్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను పోస్టర్‌లో చూపించారు. పవర్ స్టార్‌కు బ్యానర్లు కట్టడం, లవ్ లెటర్స్ రాయడం, కాలేజ్ నేపథ్యంలో జరిగే సంఘటనలు, యాక్షన్ ఎలిమెంట్స్ పోస్టర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “ధైర్యం ఉన్నవాడే తన వెంట అందరూ నడిచేలా చేసుకుంటాడు” అనే డైలాగ్ హీరో పాత్ర స్వభావాన్ని తెలియజేస్తోంది. అలాగే ప్రేమ, స్నేహం, యాక్షన్ మేళవింపుతో సినిమా రూపొందుతున్నట్లు ఫస్ట్ లుక్ స్పష్టం చేస్తోంది. ఈ చిత్రం మేఘాంశ్ శ్రీహరి కెరీర్‌లో ప్రత్యేక మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
- June 23, 2026
0
33
Less than a minute
You can share this post!
editor

