సోషల్ మీడియా ట్రోలింగ్‌పై నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని, తాను చెప్పని విషయాలను కూడా చెప్పినట్టుగా ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొంది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక, “ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా భయమేస్తోంది. నేను చెప్పిన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. ప్రతి రోజు మన గురించి ఎలాంటి రూమర్ వస్తుందోనని ఆందోళన కలుగుతోంది” అని చెప్పింది. సోషల్ మీడియా అభివృద్ధి మంచిదేనని, అయితే కొందరు దానిని తప్పుగా ఉపయోగించడం బాధాకరమని తెలిపింది. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేయడం ఒక అలవాటుగా మారిందని ఆమె వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో వ్యాపించే తప్పుడు ప్రచారాలు వ్యక్తిగత జీవితాలపై ప్రభావం చూపుతున్నాయని చెప్పింది. ప్రస్తుతం రష్మిక పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

You can share this post!
స్టూడెంట్ లైఫ్.. లవ్.. ఫైట్స్.. అన్నీ ఒక్క పోస్టర్లోనే!
‘సర్దార్ 2’ పోస్టర్‌తో అంచనాలు పెంచిన కార్తి..!
Related Articles
‘సర్దార్ 2’ పోస్టర్‌తో అంచనాలు పెంచిన కార్తి..!
స్టూడెంట్ లైఫ్.. లవ్.. ఫైట్స్.. అన్నీ ఒక్క పోస్టర్లోనే!
ఒక్క గాసిప్.. ఎన్నో జీవితాలను మార్చేసిందా..?