ఒక్క గాసిప్.. ఎన్నో జీవితాలను మార్చేసిందా..?

ఒక్క గాసిప్.. ఎన్నో జీవితాలను మార్చేసిందా..?

రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘గాసిప్’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వైభవ్ కౌండిన్య దర్శకత్వం వహిస్తున్నారు. నేటి యువతకు దగ్గరగా ఉండే భావోద్వేగాలు, అందమైన ప్రేమకథ, సోషల్ సెటైర్ అంశాలతో ఈ సినిమాను రూపొందించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రేమ, భావోద్వేగాలు, జీవితంలో జరిగే అనూహ్య సంఘటనలను ఆసక్తికరంగా చూపించిన విధానం ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో మహేష్ యడ్లపల్లి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, రవివర్మ, గురు చరణ్, ఫాల్గుణి, శృతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించగా, సతీష్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. జై కుమార్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి విడుదల చేశారు. ప్రేమకథతో పాటు సమాజానికి సంబంధించిన అంశాలను కూడా స్పృశించిన ఈ చిత్రం యూత్‌ను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles