విద్యుత్ షాక్ కొట్టే అమ్మాయితో ప్రేమలో పడ్డ తిరువీర్..!

విద్యుత్ షాక్ కొట్టే అమ్మాయితో ప్రేమలో పడ్డ తిరువీర్..!

తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న గ్రామీణ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఓ..! సుకుమారి’ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో స్థానిక రాజకీయాల్లో చురుకుగా పాల్గొనే యువకుడిగా తిరువీర్ కనిపిస్తున్నారు. మంచి మనసున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కనే అతడు దామిని అనే యువతిని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమెకు సంబంధించిన ఓ విచిత్రమైన రహస్యం కథలో ఆసక్తిని పెంచుతుంది.

టీజర్‌లో హాస్యం, ప్రేమ, గ్రామీణ జీవనశైలి, వినూత్నమైన కాన్సెప్ట్ ఆకట్టుకునేలా ఉన్నాయి. తిరువీర్ తన సహజ నటన, కామెడీ టైమింగ్‌తో మెప్పించగా, ఐశ్వర్య రాజేష్ గ్రామీణ యువతిగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సీహెచ్ కుషేందర్ అందించిన విజువల్స్, భరత్ మంచిరాజు సంగీతం టీజర్‌కు మరింత బలం చేకూర్చాయి. వినోదభరితమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Related Articles