ప్రియాంకా మోహన్‌కు వచ్చిన ఆ స్పెషల్ కాల్ ఏంటో తెలుసా..?

ప్రియాంకా మోహన్‌కు వచ్చిన ఆ స్పెషల్ కాల్ ఏంటో తెలుసా..?

దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ ప్రియాంకా మోహన్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కన్నడ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె, నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. అనంతరం తమిళ చిత్రాల్లో వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్‌గా తన స్థానాన్ని బలపరుచుకుంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘మేడ్ ఇన్ కొరియా’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందడంతో ప్రియాంకా మోహన్ క్రేజ్ మరింత పెరిగింది. ఈ విజయాన్ని గుర్తించిన కొరియా టూరిజం ఆర్గనైజేషన్ ఆమెను అధికారిక గౌరవ అంబాసిడర్‌గా నియమించడం విశేషం. కొరియా సంస్కృతి, పర్యాటక రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించనుంది. ఈ అరుదైన గౌరవం దక్కడంపై ప్రియాంకా మోహన్ ఆనందం వ్యక్తం చేస్తూ కొరియా ప్రభుత్వానికి, టూరిజం సంస్థకు కృతజ్ఞతలు తెలిపింది. గ్లోబల్ స్థాయిలో పెరుగుతున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు పలు భాషల నుంచి భారీ ప్రాజెక్టులు, క్రేజీ ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Related Articles