టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇటీవల తనపై వస్తున్న ట్రోలింగ్‌పై స్పందించింది. ‘హరి హర వీరమల్లు’, ‘ది రాజా సాబ్’ వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో సోషల్ మీడియాలో కొందరు ఆమెను ‘ఐరన్ లెగ్’ అంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిధి తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించింది.
ఎవరైనా ప్రశంసించినా, విమర్శించినా వాటిని ఎక్కువగా పట్టించుకోనని ఆమె తెలిపింది. ఇండస్ట్రీలో విజయవంతమైన హీరోయిన్గా గుర్తింపు పొందాలనే కోరిక తనకూ ఉందని చెప్పిన నిధి, ఒక సినిమా విజయం లేదా వైఫల్యం ఒక్కరి చేతుల్లో ఉండదని పేర్కొంది.
సినిమా హిట్ అయితే ఆనందిస్తానని, ప్లాప్ అయితే ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకుని తనను తాను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పింది. అదృష్టం కంటే కష్టం, ప్రతిభనే ఎక్కువగా నమ్ముతానని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

