‘వారణాసి’లో మరో సీక్రెట్ విలన్ ఉన్నాడా..?

‘వారణాసి’లో మరో సీక్రెట్ విలన్ ఉన్నాడా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీశాయి.

రామాయణంలోని కీలక ఘట్టంగా చూపించనున్న యుద్ధ సన్నివేశం కేవలం రాముడు, కుంభకర్ణుడు మధ్యే జరుగుతుందని ఆయన వెల్లడించారు. దీంతో అభిమానుల్లో కొత్త థియరీ మొదలైంది. సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర పేరు ‘కుంభ’ కావడం, రామాయణంలోని కుంభకర్ణుడితో ఉన్న పోలికలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

అయితే ‘కుంభ’కు మించి మరో శక్తివంతమైన విలన్ కూడా సినిమాలో ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘కల్కి 2898 AD’లో కనిపించిన ట్విస్టుల మాదిరిగానే ‘వారణాసి’లోనూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అంశాలు దాగి ఉన్నాయా అనే ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో నెలకొంది.

Related Articles