పూజా హెగ్డే చెప్పిన సక్సెస్ సీక్రెట్

పూజా హెగ్డే చెప్పిన సక్సెస్ సీక్రెట్

పాన్ ఇండియా హీరోయిన్ పూజా హెగ్డే తన సినీ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో విజయాలతో పాటు అవమానాలు, పరాజయాలు కూడా సహజమేనని అన్నారు. “సినిమా అనేది ఇసుక ఊబిలాంటిది. జాగ్రత్తగా లేకపోతే అందులో చిక్కుకుపోతాం. పోటీ ఉన్నా రాగద్వేషాలకు దూరంగా ఉండాలి. కష్టపడి పనిచేస్తూ, మనపై మనకు నమ్మకం ఉంటేనే విజయాన్ని అందుకోవచ్చు” అని పూజా పేర్కొన్నారు.

అలాగే, పరిశ్రమలో విజయం సాధించిన ప్రతి ఒక్కరూ ఎన్నో సవాళ్లు, పరాభవాలను ఎదుర్కొన్న వారేనని చెప్పారు. అవమానాలు, అపజయాలను అధిగమించకుండా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.

ఇటీవల విజయ్ సరసన నటించిన ‘జననాయకన్’ సినిమాతో పూజా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తన సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలనే పూజా పంచుకున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Related Articles