సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుధీర్స్ జోకర్’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ‘బిగ్ బాస్’ ఫేమ్ అయేషా హీరోయిన్గా పరిచయం అవుతోంది. విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్లో అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అయేషా పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆమె ‘షాలినీ’ పాత్రలో కనిపించనుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే పాత్రగా ఇది ఉండబోతోందని మేకర్స్ తెలిపారు.
ఇటీవల సుడిగాలి సుధీర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన మూవీ బ్యాంగర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వినోదం, కామెడీ, భావోద్వేగాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్గా ‘సుధీర్స్ జోకర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

