ఎట్టకేలకు కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా హీరో..?

ఎట్టకేలకు కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా హీరో..?

మెగా హీరో వైష్ణవ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఉప్పెన’ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ చిత్రాలతో ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాడు. దీంతో తదుపరి సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. గత మూడు సంవత్సరాలుగా వందకు పైగా కథలను విన్నప్పటికీ, ఏ కథ కూడా తనను పూర్తిగా ఆకట్టుకోలేదని సమాచారం.

అయితే తాజాగా దర్శకుడు మహేష్ ఎస్ చెప్పిన కథ వైష్ణవ్ తేజ్‌కు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో సుధీర్ బాబుతో ‘హంట్’ చిత్రాన్ని తెరకెక్కించిన మహేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర తన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, వచ్చే నెలలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు.

Related Articles