థియేటర్లు ఇవ్వకపోతే బతకడం కష్టమే..!

థియేటర్లు ఇవ్వకపోతే బతకడం కష్టమే..!

తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న సినిమాలకు థియేటర్లు దక్కకపోవడంపై నటుడు, మూవీ మేకర్ షెరాజ్ మెహదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ఫిలిం చాంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చిన్న సినిమాలను ఉద్దేశపూర్వకంగా అణగదొక్కుతున్నారని ఆరోపించారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు కూడా థియేటర్లు ఇవ్వకపోవడం వల్ల నిర్మాతలు, దర్శకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నైజాం ప్రాంతంలో తమ చిత్రానికి ఒక్క థియేటర్ కూడా కేటాయించలేదని, రీ-రిలీజ్‌లకూ అవకాశాలు కల్పించడం లేదని అన్నారు.

చిన్న సినిమాల ఎదుగుదలను అడ్డుకునే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారని, ఇది ఇండస్ట్రీ భవిష్యత్తుకు మంచిది కాదని పేర్కొన్నారు. సెన్సార్ ఫీజులు, ఇతర ఖర్చులు కూడా చిన్న నిర్మాతలపై అదనపు భారం మోపుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు ఇబ్బందులు పడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై చట్టపరంగా పోరాటం కొనసాగిస్తున్నామని వెల్లడించారు. చిన్న సినిమాలకు సమాన అవకాశాలు కల్పించి, కొత్త ప్రతిభను ప్రోత్సహించాలని ప్రభుత్వం, పరిశ్రమ పెద్దలను షెరాజ్ మెహదీ కోరారు.

Related Articles