అఖిల్ అక్కినేని హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లెనిన్’. మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్ సినిమాపై మంచి అంచనాలు తీసుకువచ్చాయి. తాజాగా విడుదలైన ‘సోల్ ఆఫ్ లెనిన్’ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘ప్రేమ కంటే గొప్ప యుద్ధం లేదు’ అనే క్యాప్షన్‌తో విడుదలైన ఈ పాటలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమ, భావోద్వేగాలను అద్భుతంగా చూపించారు. ప్రేమ కోసం హీరో చేసే పోరాటాన్ని ఈ పాట హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించింది. థమన్ అందించిన సంగీతం, కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం, వాగ్దేవి గాత్రం పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఎమోషన్స్‌ను నింపిన విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. విడుదలకు ముందే ‘లెనిన్’పై భారీ అంచనాలు నెలకొనగా, ఈ సినిమా అఖిల్ కెరీర్‌లో ప్రత్యేక మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- June 5, 2026
0
4
Less than a minute
You can share this post!
editor

