సందీప్ కిషన్ హీరోగా, జేసన్ సంజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సిగ్మా’ నుంచి విడుదలైన తొలి పాట ‘సిగ్మా స్టైల్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీత సంచలనం ఎస్. తమన్ సంగీతం అందించారు. తాజాగా హీరో దుల్కర్ సల్మాన్ ఈ పాటను విడుదల చేయగా, సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. తమన్ స్వయంగా ఆలపించిన ఈ పాట మాస్ బీట్‌లు, హై ఎనర్జీ రిథమ్స్‌తో ఆకట్టుకుంటోంది. సందీప్ కిషన్ తన స్టైలిష్ డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించగా, ఫారియా అబ్దుల్లా గ్లామర్ మరియు డ్యాన్స్ స్టెప్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జేసన్ సంజయ్ రాసిన క్యాచీ లిరిక్స్ పాటకు మరింత బలం చేకూర్చాయి. ఈ పాట విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం జూలై 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
- June 5, 2026
0
5
Less than a minute
You can share this post!
editor

