బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మూడో పెళ్లికి సిద్ధమవుతున్నారనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రెండు వివాహాలు చేసుకున్న అమీర్ ఖాన్, ఇప్పుడు గౌరీతో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. 1986లో తన చిన్ననాటి స్నేహితురాలు రీనా దత్తాను వివాహం చేసుకున్న అమీర్‌కు జునైద్ ఖాన్, ఐరా ఖాన్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. 16 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం 2002లో ఈ జంట విడిపోయింది. అనంతరం 2005లో దర్శకురాలు కిరణ్ రావును వివాహం చేసుకున్న ఆయనకు సరోగసీ ద్వారా ఆజాద్ అనే కుమారుడు జన్మించాడు. అయితే 2021లో కిరణ్ రావుతో కూడా విడిపోయారు. తాజాగా గౌరీతో అమీర్ ఖాన్ వివాహం జరగబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన నివాసంలోనే నిరాడంబరంగా ఈ పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు, సన్నిహితులు హాజరయ్యే అవకాశముందని సమాచారం. అమీర్ ఖాన్ మూడో పెళ్లి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- June 4, 2026
0
42
Less than a minute
You can share this post!
editor

