విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

విజయ్ ఆంటోని హీరోగా, దర్శకుడు శశి తెరకెక్కించిన ‘వంద దేవుళ్ళు’ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బిచ్చగాడు’ తర్వాత విజయ్ ఆంటోని-శశి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, తాజాగా చిత్ర బృందం రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది.

విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోని సమర్పణలో, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మించారు. స్వాసిక హీరోయిన్‌గా నటిస్తుండగా అజయ్, కావ్య, శక్తి, బాలాజీ శక్తివేల్, అరుళ్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో హీరో, హీరోయిన్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్, యాక్షన్, సస్పెన్స్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.

Related Articles