సోనాల్ చౌహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం ఉన్నప్పటికీ ఆమెకు కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన సోనాల్, 2008లో ‘రెయిన్‌బో’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో బాలీవుడ్ వైపు వెళ్లిన ఈ భామ, తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో ఆమెకు వరుస అవకాశాలు లభించాయి.
తాజాగా సోనాల్ చౌహన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో సోఫాపై కూర్చొని కెమెరాకు ఇచ్చిన పోజులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఓపెన్ హెయిర్, ఆకర్షణీయమైన ఆభరణాలు, గ్లామరస్ లుక్స్‌తో ఆమె మరింత అందంగా కనిపించింది. ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి భారీగా లైక్స్, కామెంట్లు వస్తుండగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. సోనాల్ తాజా లుక్స్ చూసిన అభిమానులు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.

