యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన తాజా ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తన ఇంట్లోకి వచ్చిన కొత్త అతిథులను అభిమానులకు పరిచయం చేస్తూ తారక్ కొన్ని క్రేజీ పిక్స్ పోస్ట్ చేశారు. ఇవి ఆయన పెంచుకుంటున్న అందమైన పెంపుడు పక్షులు కావడం విశేషం. వాటికి ‘అసాహి’, ‘యూహి’ అనే ప్రత్యేకమైన పేర్లు పెట్టినట్లు ఎన్టీఆర్ వెల్లడించారు. ఈ పేర్ల వెనుక ఆసక్తికరమైన సీక్రెట్ కూడా చెప్పారు. జపాన్ దేశంపై తనకున్న ప్రత్యేకమైన అభిమానంతోనే ఈ పేర్లు పెట్టినట్లు తెలిపారు. జపనీస్ భాషలో ‘అసాహి’ అంటే సూర్యోదయం, ‘యూహి’ అంటే సూర్యాస్తమయం అని అర్థమని వివరించారు. తారక్ షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో అభిమానులు ఈ పేర్లు చాలా యూనిక్‌గా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్‌గా మారి ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయి.
- May 20, 2026
0
139
Less than a minute
You can share this post!
editor

