మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ట్రైలర్ దేశవ్యాప్తంగా భారీ సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన తొలి 24 గంటల్లోనే 101 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి తెలుగు సినీ చరిత్రలో కొత్త రికార్డ్ నెలకొల్పింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఇండియా వైడ్ నెంబర్ 1 ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ పవర్‌ఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. క్రికెట్ ప్లేయర్‌గా, రెజ్లర్‌గా, రన్నర్‌గా విభిన్న షేడ్స్‌లో కనిపించిన చరణ్ పాత్ర సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఏఆర్ రెహమాన్ సంగీతం, ఆర్ రత్నవేలు విజువల్స్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘పెద్ది’ గురించే చర్చ జరుగుతోంది.
- May 20, 2026
0
105
Less than a minute
You can share this post!
editor

