మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వడ్డీ కాసుల వాడ’ టైటిల్ లాంచ్‌తోనే సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. మనోజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ కాన్సెప్ట్ వీడియోకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మనోజ్ కామెడీ టైమింగ్, ఆయన ఎనర్జీ మరోసారి అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘బిందాస్’ తర్వాత మళ్లీ ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌తో మనోజ్ జతకట్టడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈఎంఐలు, వాయిదాల నేపథ్యంలో సాగే కథకు కామెడీ, ఎమోషన్స్ జోడించి పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. టైటిల్ కూడా సామాన్య, మధ్యతరగతి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది. వింటేజ్ మనోజ్‌ను మరోసారి స్క్రీన్‌పై చూడబోతున్నామనే ఫీలింగ్ అభిమానుల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

