హీరో రోహిత్ నారా తన తదుపరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. కరణ్ సి. ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ఫీల్‌గుడ్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోంది. భరత్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి చినిమిల్లి మణికుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, నిర్మాత దిల్ రాజు తొలి షాట్‌ను డైరెక్ట్ చేశారు. సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాస్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రంలో రోహిత్ నారాకు జోడీగా నయన్ సారిక నటిస్తోంది. నరేష్ వి.కె, రోహిణి, సంపత్, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హాస్యం, ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఈ సినిమా యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందుతోంది. త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
- May 11, 2026
0
10
Less than a minute
You can share this post!
editor

