సమంత స్టెప్పులతో పాట సూపర్ హిట్..!

సమంత స్టెప్పులతో పాట సూపర్ హిట్..!

స్టార్ హీరోయిన్ Samantha Ruth Prabhu ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. దర్శకురాలు Nandini Reddy రూపొందిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెహమాన్ రాసిన ఈ పాటను చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ ఆలపించగా, సంగీత దర్శకుడు Santhosh Narayanan క్యాచీ ట్యూన్‌తో ఆకట్టుకున్నారు. పాటలో సమంత ఎనర్జిటిక్ స్టెప్పులు, క్లాసీ లుక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘ఓ బేబీ’ తర్వాత సమంత-నందినీ రెడ్డి కాంబోలో వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తోంది. దిగ్నాథ్, గుల్షన్ దేవయ్యతో పాటు పలువురు నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘మా ఇంటి బంగారం’ మే 15న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

Related Articles