వెర్సటైల్ నటుడు J. D. Chakravarthy ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘చేతబడి’ అనే టైటిల్‌తో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా బాణామతి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సూర్యాస్ రూపొందిస్తున్నారు. మహర్షి కూండ్ల ప్రెజెంట్స్‌లో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. హారర్, మిస్టరీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్ అనుభూతిని అందించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చింది. జేడీ చక్రవర్తి పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను రివీల్ చేస్తూ, ఈ సినిమాలో హీరోగా, విలన్‌గా డ్యూయల్ షేడ్స్‌లో కనిపించనున్నారని మేకర్స్ తెలిపారు. సంగీతాన్ని అచ్చు రాజమణి అందిస్తుండగా, ప్రముఖ గీత రచయిత Chandrabose కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఐదు భాషల్లో ఆడియో రైట్స్ సొంతం చేసుకున్న ఈ చిత్రం త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
- April 17, 2026
0
7
Less than a minute
You can share this post!
editor

