మల్టీ టాలెంటెడ్ దర్శకుడు Sheraz Mehdi దర్శకత్వంలో రూపొందిన ‘ఓ అందాల రాక్షసి’ చిత్రం మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో విడుదలై మంచి స్పందన పొందిన ఈ సినిమా, ప్రేక్షకుల అభ్యర్థన మేరకు ఈ నెల 24న రీ-రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రత్యేక ప్రదర్శనలో చిత్ర యూనిట్ పాల్గొని మీడియాతో మాట్లాడింది. మహిళలపై జరుగుతున్న మోసాలు, వేధింపులు వంటి సామాజిక సమస్యలను బలంగా చూపించే ప్రయత్నం చేశామని దర్శకుడు తెలిపారు. గ్లామర్‌కు దూరంగా, కథకు ప్రాధాన్యతనిచ్చి తెరకెక్కించిన ఈ సినిమా మహిళలకు అవగాహన కలిగించేలా ఉంటుందని చెప్పారు. కన్నడలో ‘ఓ సుందర రాక్షసి’ పేరుతో విడుదలై అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. ఇందులో Vihaanshi Hegde, Krithi Varma ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ రీ-రిలీజ్ ద్వారా మరింత మంది ప్రేక్షకులకు ఈ సినిమా చేరాలని యూనిట్ ఆశిస్తోంది.
- April 17, 2026
0
5
Less than a minute
Tags:
You can share this post!
editor

