‘రాకాస’ సినిమా విడుదలైన తక్కువ సమయంలోనే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించి, అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసింది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు కలిసి నిర్వహించిన బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్లో టీమ్ ఆనందాన్ని పంచుకుంది. నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ, డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండడం నిజమైన విజయమని అన్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కృతజ్ఞతలు తెలుపుతూ, తమపై నమ్మకం ఉంచి సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన వారందరికీ థ్యాంక్స్ చెప్పారు. సమ్మర్లో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారికతో పాటు మొత్తం టీమ్ ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఇకపై కూడా మంచి సినిమాలు తీసి అందరినీ ఎంటర్టైన్ చేస్తానని హామీ ఇచ్చారు. ‘రాకాస’ను తక్కువ ధరలో థియేటర్లలో చూసి ఆనందించాలంటూ ప్రేక్షకులను ఆహ్వానించారు.
- April 11, 2026
0
12
Less than a minute
You can share this post!
editor

