‘బైకర్’ సక్సెస్ మీట్‌లో శర్వా ఎమోషనల్..!

‘బైకర్’ సక్సెస్ మీట్‌లో శర్వా ఎమోషనల్..!

‘బైకర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. చార్మింగ్ స్టార్ శర్వా హీరోగా, మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో డాక్టర్ రాజశేఖర్ పవర్‌ఫుల్ పాత్రలో మెప్పించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ మోటోక్రాస్ డ్రామా విడుదలైన మొదటి రోజు నుంచే అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. తాజాగా నిర్వహించిన థాంక్ యూ మీట్‌లో శర్వా మాట్లాడుతూ మీడియా, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. “నేను హిట్ కొడితే మీరు హిట్ కొట్టినట్టే ఫీల్ అవుతారు” అని అభిమానులతో అనుబంధాన్ని వ్యక్తం చేశారు. రాజశేఖర్ గురించి మాట్లాడుతూ “ఆయన ఎప్పుడూ మా హీరోనే” అన్నారు. డాక్టర్ రాజశేఖర్ కూడా ఈ సినిమా విజయంలో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రేక్షకులు కుటుంబంతో కలిసి సినిమా చూడాలని సూచించారు. టీమ్ మొత్తం ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది.

Related Articles