మాస్టర్ సంకల్ప్ ట్రైలర్ రాకతో సోషల్ మీడియా షాక్!

మాస్టర్ సంకల్ప్ ట్రైలర్ రాకతో సోషల్ మీడియా షాక్!

పలువురు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న బాలల చిత్రాలను రూపొందిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక-నిర్మాతగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న డా. భీమగాని సుధాకర్ గౌడ్ మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్స్‌పై ఆదిత్య, క్రియేటివ్ జీనియస్, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్, అభినవ్ వంటి బాలల సినిమాలను అందించిన ఈ టీమ్ తాజాగా తమ ఆరవ చిత్రంగా మాస్టర్ సంకల్ప్ను సిద్ధం చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు. ప్రముఖ నటుడు శివాజీ రాజా ట్రైలర్‌ను లాంచ్ చేసి టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఈవెంట్‌లో దర్శక-నిర్మాత డా. భీమగాని సుధాకర్ గౌడ్, శ్రీ మిత్ర చౌదరి, పెంచల్ రెడ్డి పాల్గొన్నారు. ట్రైలర్ విడుదల సందర్భంగా డా. సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ, మాస్టర్ సంకల్ప్ ట్రైలర్ రిలీజ్‌కు వచ్చిన అతిథులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

editor

Related Articles