ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కిన ఐశ్వర్యారాయ్

ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కిన ఐశ్వర్యారాయ్

బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ అశ్లీల ఫొటోల విషయంపై ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కారు. నా పర్మిషన్ తీసుకోకుండా నా ఫొ టోలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించబడుతున్న అశ్లీల ఫొటోలను వాడుకుంటున్న వారిని అడ్డుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ దాఖలు చేశారు. తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసమే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఐశ్వ‌ర్య పేర్కొంది. అయితే ఈ కేసు నేడు విచార‌ణ‌కు రాగా.. ఐశ్వర్య తరపున వాదించిన సీనియర్ అడ్వకేట్ సందీప్ సేథీ మాట్లాడుతూ.. మా క్లయింట్ (ఐశ్వర్యారాయ్) ఫొటోలు కానీ, రూపం కానీ తన పర్మిషన్ లేకుండా ఉపయోగించుకునే హక్కు ఎవరికీ లేదు. ఒక వ్యక్తి ఆమె పేరు ముఖాన్ని ఉపయోగించి AI ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు అని సేథీ వాదించారు. ఇది చాలా దురదృష్టకరం అని ఆయన కోర్డు ముందు పేర్కొన్నారు. అయితే ఐశ్వ‌ర్య పిటిషన్ ని విచారించిన జస్టిస్ తేజస్ కరియా దీనిపై ప్రతివాదులకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని సూచన చేశారు. ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను నవంబర్ 7న జాయింట్ రిజిస్ట్రార్ ముందుకి.. ఆ తర్వాత జనవరి 15, 2026న కోర్టు ముందుకి వాయిదా వేసినట్లు హైకోర్టు తెలిపింది.

editor

Related Articles