మన తెలుగు స్మాల్ స్క్రీన్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు సీజన్ 9 గ్రాండ్ గా లాంచ్ అయ్యి రెండు రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుంది. అప్పుడే ఈ రెండు రోజుల్లోనే బిగ్ బాస్ హౌస్ లో యునానిమస్ గా ఓ కంటెస్టెంట్ ని కూడా నామినేషన్ చేయడం జరిగింది.
మరి హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అంతా మాట్లాడుకొని సంజనా గల్రాని పేరు ఒక్క దాన్ని మాత్రమే చెప్పడం వీక్షకుల్లో గందరగోళం ఏర్పడింది. దీనిపై వదిలిన లేటెస్ట్ ప్రోమోతో మొదటి వారం ఎలిమినేషన్ కోసం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ గా సంజనా గల్రాని కనిపిస్తున్నారు. దీనితో ఆల్ రెడీ సోషల్ మీడియాలో కూడా ఫస్ట్ ఎలిమినేషన్ ఈమెనే అయి ఉండచ్చు అని స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. సో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది సంజనయేనా కాదా అనేది వేచి చూడాలి. ఇక ఈ షోకి కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు, జియో హాట్ స్టార్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
