జూలై 18న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి సంచలనం సృష్టించిన హిందీ సినిమా సయ్యారా. దాదాపు రూ.45 కోట్ల లోపు బడ్జెట్ తో అహాన్ పాండే, అనీత్ పడ్డా హీరో హీరోయిన్లుగా యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాని తెరకెక్కించగా లవ్ చిత్రాల మాష్టర్ మోహిత్ సూరి డైరెక్ట్ చేశాడు. థియేటర్లలో కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేసిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సంసిద్దమైంది. వాణి బత్రా (అనీత్ పడ్డా) మహేష్ అనే కుర్రాడితో ప్రేమలో ఉండి పెళ్లివరకు వెళుతుంది.. తీరా పెళ్లి చేసుకునే సమయానికి నాకు కెరీరే ముఖ్యమంటూ వాణిని వదిలేసి వెళ్లిపోతాడు దీంతో ప్రేమలో విఫలమైన యువతి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. ఆపై తను చేసే రచనలు రాయడం కూడా మానేస్తుంది. మరోవైపు సంగీతం అంటే ప్రాణం పెట్టే క్రిష్ కపూర్ ఎలాగైనా మ్యూజిక్ లో పైస్థాయికి ఎదగాలని లక్ష్యంతో అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటాడు. ఓ సందర్భంలో వాణిని కలిసిన కృష్ణ ఆమె రాసిన పాటలకు ఫిదా అవుతాడు ఆపై ఆమెతో ప్రేమలో పడతాడు.. కానీ వాణికి అల్జీమర్స్ (జీవితంలో జరిగిన సంఘటలను మర్చిపోవడం) అనే అనారోగ్య సమస్య ఉందని తెలుసుకున్న క్రిష్ వాణికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ఇప్పుడీ సినిమా సెప్టెంబర్ 12 నుంచి నెట్ ఫ్లిక్స్, ఓటీటీలో కేవలం హిందీ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ కు రానుంది. అయితే ఒకటి రెండు సన్నివేశాల్లో ముద్దులు, సెక్సీపాళ్లు ఎక్కువగా ఉన్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇబ్బంది పెడతాయి. పిల్లలు పడుకున్నాక ఈ సినిమా సయ్యారా చూడడం బెటర్.

- September 8, 2025
0
60
Less than a minute
You can share this post!
editor