బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. నటుడు ఆశిష్ వారంగ్ మృతి చెందారు. 55 ఏళ్ల ఆశిష్ మృతికి కారణాలు ఏంటి అనేవి ఇంకా తెలియరాలేదు. అతని ఆకస్మిక మరణవార్త విన్న బాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆశిష్.. బాలీవుడ్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించాడు. అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ, దృశ్యం, మర్దానీ, ఏక్ విలన్ లాంటి సినిమాలు ఆశిష్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. హిందీలోనే కాకుండా మరాఠీ సినిమాల్లో కూడా ఆశిష్ నటించి మెప్పించాడు. ఇంకెంతో మంచి గుర్తింపు తెచ్చుకోవాల్సిన ఆశిష్ ఇలా అర్ధాంతరంగా మృతిచెందడం ఎంతో బాధకరమని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆశిష్ మృతికి కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియకపోవడంతో బాలీవుడ్ మీడియా ఏవేవో అనుమానాలను వ్యక్తం చేస్తోంది. మరి ఆశిష్ వారంగ్ మరణానికి కారణం ఏంటి అనేది త్వరలోనే తెలుస్తుందేమో చూడాలి.

- September 6, 2025
0
61
Less than a minute
You can share this post!
editor