ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్ కి భారీ రేటు..!

ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్ కి భారీ రేటు..!

టాలీవుడ్‌ హీరోల్లో ఎన్టీఆర్ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఇటీవల బాలీవుడ్ లో్ “వార్ 2తో సంద‌డి చేశారు. ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, అభిమానుల‌ని కొంత నిరాశ‌ప‌రిచింది. ఇక ఇప్పుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డ్రాగ‌న్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాని భారీ బ‌డ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ పేరు మరోసారి వైరల్ అవుతోంది. అయితే ఈసారి కారణం సినిమా కాదు… ఒక అద్భుతమైన స్కెచ్ ఆర్ట్! తెలుగు అమ్మాయి బ్యులా రూబీ పెన్సిల్ ఆర్ట్‌ లతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు పొందుతోంది. సినిమా సెలబ్రిటీలు, స్టార్ హీరోల చిత్రాలను స్కెచ్ రూపంలో తీర్చిదిద్ది వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అమ్మకానికి పెడుతోంది. తాజాగా ఆమె గీసిన ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ స్కెచ్ ను చూసిన ఓ ఎన్టీఆర్ అభిమాని అమెరికా నుండి బ్యులా రూబీకి మెసేజ్ చేసి, తాను ఆ ఆర్ట్ ను కొనాలనుకుంటున్నానని తెలిపాడు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. బ్యులా రూబీ తెలిపిన వివరాల ప్రకారం, “ఇది నేను గీసిన తెలుగు హీరోల పెన్సిల్ స్కెచ్ లలో అత్యధిక ధరకు అమ్ముడైంది. ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ ఇన్‌ స్టాగ్రామ్‌ లో నన్ను సంప్రదించి, దీన్ని 1,650 డాలర్లకు అంటే సుమారుగా రూ.1.45 లక్షల‌కు కొనుగోలు చేశాడు. ఈ ధరకు నా స్కెచ్ అమ్ముడుపోవడం నాకే ఆశ్చర్యమనిపించింది.

editor

Related Articles