న‌వంబ‌ర్‌లో నారా వారింట్లో పెళ్లి..

న‌వంబ‌ర్‌లో నారా వారింట్లో పెళ్లి..

టాలీవుడ్‌లో త‌న‌దైన‌ స్టైల్‌తో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో నారా రోహిత్ ఒకరు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి సోదరుడి కుమారుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రోహిత్, కెరీర్ ప్రారంభంలోనే బాణం, ప్రతినిధి వంటి సినిమాలతో సీరియస్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొన్ని వరుస ఫ్లాపులతో అతని కెరీర్ కాస్త డౌన్‌లోకి వెళ్లింది. దీంతో కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని వెయిట్ & సీ అనే  కాన్సెప్ట్‌తో భారీమార్పులు చేసుకున్నారు. రోహిత్, తాజాగా ‘సుందరకాండ’ అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా, పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన ఈ సినిమా, రోహిత్‌కి మంచి బూస్టప్‌ని అందించింది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందిన ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ను రాబట్టడంతో, రోహిత్ ప్రమోషన్స్‌లో ఫుల్ జోష్‌తో పాల్గొంటున్నారు. తాజాగా గుంటూరులో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న రోహిత్, అక్కడ గణేష్ మహరాజ్‌ని దర్శించుకుని ఫ్యాన్స్‌తో, మీడియాతో మాట్లాడారు. “ఇంత కాలం తర్వాత ఆడియెన్స్ నుండి ఇలాంటి స్పందన రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది నాకు నమ్మకాన్ని కలిగిస్తోంది,” అని చెప్పారు. ఈ సందర్భంగా రోహిత్ తన పెళ్లి గురించి కూడా ఓ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటివారంలో కానీ నా పెళ్లి ఉంటుందని పెద్దలు నిశ్చయించారని అధికారికంగా ప్రకటించారు.

editor

Related Articles