పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ కలయికలో చేస్తున్న అవైటెడ్ సినిమాయే “ఓజి”. భారీ అంచనాల మధ్య సెట్ చేసుకున్న ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ నటించగా వీరి ఇద్దరి మధ్య సాగే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్‌ని రెండో పాటగా ఈ సినిమా నుండి విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సాంగ్ రిలీజ్‌పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తోంది. దీనితో ఈ ఆగస్ట్ 27న మేకర్స్ వినాయక చవితి కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది. సో ఓజి సాంగ్ కేవలం మరికొన్ని రోజుల్లోనే రానుంది అని చెప్పవచ్చు. అయితే దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ సెప్టెంబర్ 25న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

- August 23, 2025
0
65
Less than a minute
You can share this post!
editor