మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సినిమా ‘విశ్వంభర’ . ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న వశిష్ఠ (బింబిసార ఫేమ్) దర్శకత్వం వహిస్తుండగా, సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. వాస్తవానికి 2025 సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ కావల్సి ఉన్నా సమ్మర్‌కి పోస్ట్ పోన్ చేశారు. కాని అప్పుడు సినిమా రిలీజ్ కాలేదు. కనీసం తర్వాత రిలీజ్ డేట్ కూడా చెప్పలేదు. అయితే ఇప్పటికే సినిమాకి సంబంధించి విడుదలైన గ్లింప్స్‌కి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా వి.ఎఫ్.ఎక్స్ గురించి చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. దీంతో నిర్మాతలు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు అని భావించి సినిమాని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. క్వాలిటీ ఔట్‌పుట్‌తోనే సినిమాని జనాల్లోకి వదలాలని భావించారు చిత్ర బృందం. అయితే చిరంజీవి బర్త్ డే సందర్భంగా సినిమా టీజర్‌ని ఈ రోజు సాయంత్రం 6.06 నిముషాలకి టీజర్ విడుదల చేయబోతున్నారు. కొద్ది సేపటి క్రితం సినిమా చిన్న వీడియోని విడుదల చేయగా, ఇందులో చిరంజీవి ఆసక్తికర విషయాలు తెలియజేశారు. సినిమా ఆలస్యానికి కారణం మీకు అత్యున్నత ప్రమాణాలతో, బెస్ట్ క్వాలిటీతో సినిమాని మన ముందుకు తీసుకురావాలనే చిత్ర బృందం ఇంత సమయం తీసుకుంటోందని చిరంజీవి అన్నారు. ఇది చందమామ కథలాగా సాగిపోయే అద్భుతమై కథ. చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లల మనస్తత్వం గలవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది అని చిరంజీవి అన్నారు. ఇక సినిమాని 2026 సమ్మర్‌కి విడుదల చేయనున్నట్టు చిరంజీవి స్వయంగా చెప్పుకొచ్చారు.

- August 21, 2025
0
18
Less than a minute
Tags:
You can share this post!
editor