తండేల్ క‌థ‌తో వెబ్ సిరీస్.. ‘అరేబియా కడలి’ ట్రైల‌ర్

తండేల్ క‌థ‌తో వెబ్ సిరీస్.. ‘అరేబియా కడలి’ ట్రైల‌ర్

తండేల్ సినిమా  క‌థ‌తో తాజాగా ఒక వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌లో స‌త్య‌దేవ్ హీరోగా న‌టిస్తున్నాడు. ‘అరేబియా కడలి’  అంటూ రాబోతున్న ఈ వెబ్ సిరీస్‌కి సూర్యకుమార్ దర్శకత్వం వహించ‌గా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కథా రచయితగా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్  ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై  వై.రాజీవ్ రెడ్డి, జె. సాయిబాబు నిర్మిస్తుండగా.. స‌త్య‌దేవ్‌తో పాటు, ఆనంది, నాసర్, రఘుబాబు, దలీప్ తాహిల్, పూనమ్ బజ్వా, ప్రభావతి, హర్ష రోషన్, ప్రత్యూష సాధు, కోట జయరామ్, వంశీ కృష్ణ, భరత్ భాటియా, చంద్ర ప్రతాప్, డానిష్ భట్, రవి వర్మ, అమిత్ తివారీ, నిహార్ పాండ్యా, అలోక్ జైన్ తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 8, 2025 నుండి తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతుండ‌గా.. తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. ఈ ట్రైల‌ర్ చూస్తుంటూ తండేల్ సినిమాలానే అనిపిస్తోంది. అయితే దీనిపై మేక‌ర్స్‌ స్పందిస్తూ.. ‘అరేబియా కడలి’ వెబ్ సిరీస్ షూటింగ్ 2024 లో ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో ఇదే కథాంశంతో కొన్ని సినిమాలు వచ్చినా, ‘అరేబియా కడలి’ కథ మాత్రం పూర్తిగా కొత్తది, అసలైనది అని మేకర్స్ స్పష్టం చేశారు.

editor

Related Articles