బాలీవుడ్ నటులు జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ డ్రామా సినిమా ‘పరమ్ సుందరి’ విడుదల తేదీని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తుండగా.. మ్యాడాక్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాని ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మొదట జులైలో ఈ సినిమాను విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా ఆగస్టు 29న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. సౌత్ ఇండియా – నార్త్ ఇండియా లవ్‌స్టోరీగా ఈ సినిమా రాబోతుంది.

- July 30, 2025
0
59
Less than a minute
Tags:
You can share this post!
editor