మ‌హేష్ బావ బంగారం.. ఫ్యామిలీ మ్యాన్‌గా అదుర్స్..

మ‌హేష్ బావ బంగారం.. ఫ్యామిలీ మ్యాన్‌గా అదుర్స్..

 సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత బిజీ స్టారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే ఆయన ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఫ్యామిలీకి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్  ఇస్తాడు. ఇతర తెలుగు హీరోలతో పోలిస్తే మహేష్ బాబు త‌న కుటుంబంతో విదేశీ టూర్స్‌కి ఎక్కువగా వెళ్లే వ్యక్తిగా గుర్తింపు పొందారు. సినిమాలు, ఫ్యామిలీ రెండింటినీ బ్యాలెన్సింగ్‌గా మేనేజ్ చేస్తూ ఫ్యామిలీ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రతి సినిమా పూర్తయిన తర్వాత ఫ్యామిలీతో ఓ వెకేషన్‌కు వెళ్లడం ఆయనకు అలవాటే. ఇది ఆయనకు మానసికంగా మంచి రిలీఫ్‌ను ఇస్తుంది. తల్లిదండ్రులను, అన్నయ్యను కోల్పోయిన తర్వాతా అందరికీ ఆత్మస్థైర్యం ఇచ్చాడు మహేష్ అని శిల్పా తెలిపారు. ఇక త‌న సోద‌రి గురించి మాట్లాడుతూ.. నమ్రత అంటే నాకు చాలా ఇష్టం, ఆమె కూడా నన్ను చాలా స్నేహపూర్వకంగా చూసుకుంటుంది అని చెప్పుకొచ్చింది శిల్పా.. 90లలో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించిన శిల్పా శిరోద్కర్, ఇటీవ‌ల‌ బిగ్ బాస్ హిందీ సీజన్ 18లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆమె అప్పుడప్పుడూ మహేష్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ అభిమానుల‌ని అల‌రిస్తూ ఉంటుంది.

editor

Related Articles