కూలీ నుండి ‘పవర్‌హౌస్‌’ సాంగ్ విడుద‌ల..

కూలీ నుండి ‘పవర్‌హౌస్‌’ సాంగ్ విడుద‌ల..

సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘కూలీ’ సినిమా నుండి తాజాగా ‘పవర్‌హౌస్’ 3వ పాట విడుదలైంది. ఈ పాట లిరికల్ వీడియోను హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గ్రాండ్‌గా విడుదల చేశారు మేక‌ర్స్‌. ఈ ‘పవర్‌హౌస్’ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించడమే కాకుండా, అరివుతో కలిసి పాడారు. మాస్ బీట్స్, ర్యాప్ స్టైల్‌తో ఈ పాట శ్రోతలను ఉర్రూతలూగిస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించి, చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా నుండి “చికిటు”, “మోనికా” అనే రెండు పాటలు విడుదలై సూప‌ర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఆ విషయం మీకు తెలుసు.

editor

Related Articles