ప‌వన్, ఎఎం ర‌త్నంపై ప్ర‌శంస‌ల వర్షం కురిపించిన క్రిష్..

ప‌వన్, ఎఎం ర‌త్నంపై ప్ర‌శంస‌ల వర్షం కురిపించిన క్రిష్..

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా ఎఎం రత్నం సమర్పణలో రూపొందిన సినిమా ‘హరిహర వీరమల్లు’. అనేక వాయిదాల త‌ర్వాత ఈ సినిమా ఎట్ట‌కేల‌కి ప్రేక్షకుల ముందుకు రెండు రోజుల్లో వ‌స్తోంది. గత ఐదేళ్లుగా వివిధ కారణాల వల్ల వాయిదాల పర్వం ఎదుర్కొన్న ఈ సినిమా జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌తో పాటు, శిల్పకళా వేదికలో గ్రాండ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈవెంట్‌లో మాట్లాడిన పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ స్క్రిప్ట్ వినగానే ఇది సాధారణ కథ కాదని అర్థమైంది. కృష్ణా తీరంలో దొరికిన కోహినూర్ వజ్రం హైదరాబాద్ సుల్తానుల దగ్గరికి ఎలా చేరింది… ఆ తర్వాత దాని ప్రయాణం ఎలా సాగింది అన్న నేపథ్యంలో జరిగే కథ ఇది. క్రిష్ జాగర్లమూడి మంచి కాన్సెప్ట్‌తో నా దగ్గరకు వచ్చారు. అందుకు ఆయన్ని అభినందించి తీరాలి’ అంటూ పవన్ ప‌లుమార్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాపై ఇన్నాళ్లు ఎలాంటి కామెంట్ చేయ‌ని క్రిష్ తాజాగా పవన్‌ను మెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్  సాధారణ వ్యక్తి కాదు. ఎఎం రత్నం భారతీయ సినిమాకి ఓ ఆర్కిటెక్ట్ లాంటి వారు. ఈ స్థాయికి సినిమా రావడానికి వీరిద్దరి పాత్ర ఎంతో గొప్పది, అంటూ కృతజ్ఞతలు తెలిపారు. వ్య‌క్తిగ‌తంగా ఈ సినిమా నాకు ప్ర‌త్యేకం అని క్రిష్ అన్నాడు. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ సందర్బంగా ఇద్దరు లెజెండ్స్ పవన్ కళ్యాణ్, ఎఎం రత్నం గార్లకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ క్రిష్ జాగర్లమూడి త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు. క్రిష్ తప్పుకున్న తర్వాత మిగిలిన భాగం ఎఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి సినిమాను పూర్తి చేశారు.

editor

Related Articles