బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఇటీవల ఒక షూటింగ్‌లో భాగంగా స్టంట్ మాస్టర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అతడు చనిపోయిన తర్వాత చలించిపోయిన నటుడు అక్షయ్ కుమార్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు 650 మంది స్టంట్‌మెన్‌లకు ఆరోగ్య, ప్రమాద బీమా కవరేజీని అందించారు. దీంతో ఈ విషయం తెలిసిన బాలీవుడ్ మీడియా, పలువురు ప్రముఖులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమిళ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో వస్తున్న వెట్టువమ్ అనే సినిమా షూటింగ్‌లో అపశృతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌లో స్టంట్‌మ్యాన్ మోహన్‌రాజ్ (52) మృతి చెందారు. తమిళనాడు నాగపట్నం సమీపంలో కారుతో స్టంట్స్ చేస్తుండగా రాజు అకస్మాతుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. రాజు మృతి పట్ల చిత్రబృందంతో పాటు దర్శకుడు పా.రంజిత్ సంతాపం వ్యక్తం చేశాడు.

- July 18, 2025
0
113
Less than a minute
Tags:
You can share this post!
editor