సీఎంతో డిన్న‌ర్‌కి హాజ‌రైన నాగార్జున‌, అల్లు అర‌వింద్, సురేష్ బాబు..

సీఎంతో డిన్న‌ర్‌కి హాజ‌రైన నాగార్జున‌, అల్లు అర‌వింద్, సురేష్ బాబు..

హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు ఇటీవ‌ల అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. తాజాగా నగరంలోని చారిత్రాత్మక చౌమొహల్లా ప్యాలెస్‌లో అందాల భామ‌ల కోసం ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం. ఇక ఈ విందు కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సతీమణితో కలిసి హాజరయ్యారు. ప‌లువురు ప్రతినిధులు, కంటెస్టెంట్లు కూడా సందడి చేశారు. చారిత్రాత్మక చౌమొహల్లా ప్యాలెస్‌కి 109 దేశాల నుండి కంటెస్టెంట్లు రాగా, వారి రాక‌తో చౌమొహల్లా ప్యాలెస్ కళ కళలాడుతూ మెరిసిపోయింది. మరోవైపు ఈ కార్య‌క్ర‌మానికి అక్కినేని నాగార్జున , అల్లు అర‌వింద్ హాజ‌ర‌య్యారు. వారు రేవంత్ రెడ్డి ప‌క్క‌న కూర్చొని స‌ర‌దాగా మాట్లాడుతూ క‌నిపించారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా ఈ ఈవెంట్‌కి హాజరయ్యారు.

editor

Related Articles